రాజస్థాన్ రాయల్స్ పై 287 పరుగులు చేసి ఈ సీజన్ లో గ్రాండ్ లెవల్లో ప్రారంభించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆ తర్వాత మూడు మ్యాచుల్లో నిద్రపోయింది. ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు ఉంది ఆ టీమ్ పరిస్థితి. టీమ్ నిండా మ్యాచ్ విన్నర్సే. ఒంటి చేత్తో విధ్వంసం సృష్టించి పారేయగల కాటేరమ్మ కొడుకుల్లాంటి ప్లేయర్స్. మరి ఏమైందో తెలియదు. వరుసగా లక్నో, ఢిల్లీ, కోల్ కతా ల మీద ఓటమి చవి చూసింది సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమవుతోంది. హెడ్, అభిషేక్ అయిపోయిన తర్వాత మరో బ్యాటర్ క్రీజులో నిలబడలేకపోతున్నాడు. కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తున్నా ఆశించిన స్థాయిలో ప్రమాణాలు ఉండటం లేదు. సో ఈరోజు గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఇక ఆడిన మూడు మ్యాచుల్లో ఫస్ట్ ది ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ తర్వాత రెండు మ్యాచుల్లోనూ దుమ్ము రేపింది. ప్రధానంగా గుజరాత్ ఓపెనర్ సాయిసుదర్శన్, బట్లర్ మంచి ఫామ్ లో ఉండటం గుజరాత్ కు పెద్ద బలం. బౌలింగ్ లో కూడా ఇషాంత్ శర్మ, సాయికిశోర్, రషీద్ ఖాన్ పరుగులు కంట్రోల్ చేసి గుజరాత్ బ్యాటర్ల కష్టాన్ని నిలబెడుతున్నారు. చూడాలి మరి ఈ రోజు గుజరాత్ ను ఓడించిన ఆరెంజ్ ఆర్మీ కమ్ బ్యాక్ ఇస్తుందో..లేదో నాలుగో ఓటమిని మూటగట్టుకుంటుందో.